Monday, November 17, 2025
HomeతెలంగాణAmirpet: స్మశాన వాటిక పనులు పరిశీలించిన మాధవరం

Amirpet: స్మశాన వాటిక పనులు పరిశీలించిన మాధవరం

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్మశాన వాటిక పనులను పరిశీలించారు. బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి నూతనంగా నిర్మిస్తున్న స్మశాన వాటికి పనులను పరిశీలించిన మాధవరం… దశాబ్దాల కాలంగా బేగంపేట వాసులు ఎదురు చూస్తున్న స్మశాన వాటిక పనులు పూర్తయ్యాయని అతి త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామన్నారు. అత్యాధునిక సదుపాయాలతో దీన్ని నిర్మించామన్నారు. ఎంతమంది అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ స్మశాన వాటికకు వచ్చే ప్రజలకు ఇది ఒక స్మశాన వాటికలా కాకుండా ఆహ్లాదమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని , భగవద్గీత శ్లోకం ప్రకారం పుట్టిన వారికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు అనే శ్లోకం ప్రకారం మనిషిలోని ఆత్మస్థైర్యాన్ని పెంచే శ్లోకాలను, చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad