రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు, హెల్పర్స్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగ విరమణ అనంతరం చెల్లించాలని కనీస వేతనం 26,000 ఉండే విధంగా నిర్ణయించాలని వారు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు భారీ సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం వద్ద టెంటు వేసుకొని తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నామని వారు తెలుగుప్రభ ప్రతినిధితో తమ గోడు వెళ్లగక్కారు. తమ సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నదని, తమ డిమాండ్లు నెరవేర్చాలని, డిమాండ్లు నెరవేరేంత వరకూ సమ్మె విరమించేది లేదని వారు తెగేసి చెప్పారు. మూడు సంవత్సరాల చిన్న పిల్లలను ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు తమ వద్ద ఉంచుకొని వారికి మేమెంతో సేవలందిస్తుంటే మా సేవలను గుర్తించడం లేదని, వీటితో పాటు ఓటర్ల లిస్టు, వ్యాక్సినేషన్ వంటి వివిధ పనుల్లో తమకు విపరీతంగా పని ఇస్తూ గుర్తింపు, వేతనాలు మాత్రం దానికి తగ్గట్టు ఇవ్వటం లేదని వాపోయారు.