Sunday, September 8, 2024
HomeతెలంగాణIllandukunta: అపర భద్రాద్రిలో కమనీయం రమణీయం కళ్యాణం

Illandukunta: అపర భద్రాద్రిలో కమనీయం రమణీయం కళ్యాణం

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వేద పండితుల వేదమంత్రోత్సరాలతో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం రామాచార్యులు, వంశీదాచార్యులు వేద పండితులు వేణుగోపాలాచార్యులు, హరికృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల ఎదురుకోళ్ల వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను కళ్యాణ వేదిక వద్దకు రామనామ స్మరణతో తీసుకువచ్చారు. కళ్యాణ ప్రాంగణమంతా శ్రీరామనామ అంటూ భక్తుల నినాదాలతో మార్మోగింది. సుమారు లక్ష మంది భక్తులు కల్యాణ వేడుకకు హాజరయ్యారు.

- Advertisement -

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద పండితులు సుమారు రెండు గంటలపాటు కల్యాణ వేడుకను నిర్వహించగా భక్తులు ఆసక్తిగా తిలకించారు.

 ప్రముఖులు వచ్చినప్పుడు స్వల్ప తోపులాట…..

సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తీసుకు వస్తున్న సమయంలో, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కళ్యాణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ బల్మూరు వెంకట్ కళ్యాణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో ఆయా పార్టీల నాయకులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంకణాల శ్రీలత సురేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోటపోతుల ఐలయ్య, స్థానిక ఎంపిటిసి దాంసాని విజయకుమార్, నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News