Thursday, September 19, 2024
HomeతెలంగాణArmuru: ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ కంట్లో చూసినా సంతోషం

Armuru: ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ కంట్లో చూసినా సంతోషం

ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలన వల్ల ఏ ఇంట్లో చూసినా సంక్షేమం, ఏ కంట్లో చూసినా సంతోషం కనిపిస్తున్నదని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజక వర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీలకు చెందిన వేలాది మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని విశ్వ బ్రాహ్మణులు, గొల్లకురుమలంతా బీఆర్ఎస్ గూటికి చేరడం విశేషం. వీరంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడమే కాక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు పలికారు. ఆర్మూర్ లో జరిగిన కార్యక్రమంలో జీవన్ రెడ్డి సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చు కున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై తామంతా బీఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వారు స్పష్టం చేశారు. వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. “దేశ్ కీ నేత కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అనే నినాదాలతో ఆర్మూర్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల బాగుపడని పల్లె లేదు,మేలు జరగని ఇల్లు లేదని వ్యాఖ్యానించారు. 450 పథకాలు అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల దేవుడు అని ఆయన అభివర్ణించారు. సంపద పెంచి పేదలకు పంచుతున్న జనహృదయ నేత కేసీఆర్. తెలంగాణ పథకాలను పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ పథకాలు తమకూ కావాలని వారు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంపట్ల మహారాష్ట్ర ప్రజల్లో విశ్వాసం వ్యక్తం అవుతోంది. అందుకే ఇటీవల జరిగిన నాందేడ్, కందార్ లోహ, ఔరంగబాద్ బీఆర్ఎస్ సభల్లో ఒక్కొక్క సభ ద్వారా లక్ష మంది చొప్పున పార్టీలో చేరారు.
తొమ్మిది విడతలలో రైతుబంధు పథకం కింద 62 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.80వేల కోట్లు బదిలీ అయ్యాయి. రూ.40వేల కోట్ల వ్యయంతో వ్యవసాయ రంగానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. రూ.లక్షన్నర కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి దాదాపు కోటి ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్. రూ.40 వేల కోట్లతో మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్దరణ చేసి కొత్త ఆయకట్టుకు ప్రాణం పోసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది. ఇప్పటి వరకు 12 లక్షల మందికి పైగా రూ.1,00,116 చొప్పున ఇచ్చి కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు జరిపించిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిది. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికీ మాంచినీటి సరఫరా జరుగుతోంది. ఆర్మూర్ కు వందపడకల ఆసుపత్రి ఇస్తూ 27 కోట్ల రూపాయలు మంజూరు చేసిన మనసున్న మహారాజు కేసీఆర్. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే 25వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి రూ.3 వేల విలువ చేసే కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను ప్రభుత్వం ఇస్తున్నది. ఇక్కడ ఏర్పాటైన డయాలసిస్ సెంటర్ ద్వారా రోజుకి 20మందికి చొప్పున ఉచితంగా సేవలందిస్తున్నారు. ఇంటింటికీ పెద్దకొడుకులా కేసీఆర్ ప్రతి నెలా 50 లక్షల మందికి రూ.2016 నుండి రూ.3016 ఆసరా ఫించన్ల పంపిణీ చేస్తున్నారు. తమను గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం మాత్రం తమ వేతనాలు భారీగా పెంచి తమ గౌరవాన్ని పెంచిందని, అందుకే తామంతా కేసీఆర్ వైపే ఉంటామని సఫాయి కార్మికులు చెబుతున్నారు. తమ క్రమబద్దీకరణ ఫైల్ పై సంతకం చేసిన కేసీఆరే తమ దేవుడని కాంట్రాక్టు ఉద్యోగులు అంటున్నారు. తమందరికీ గొర్రెల యూనిట్లు వచ్చాయని, తమకు రెండు ఎకరాల భూమిలో ఫంక్షన్ హాలు మంజూరు చేసి నిధులిచ్చిన కేసీఆరే తమ దేవుడని, గొల్లకురుమలంతా స్పష్టం చేస్తున్నారు. ఏ ఊరూ వాడ చూసినా జనమంతా కేసీఆర్ కావాలి, రావాలి, మళ్లీ గెలవాలి అని అంటున్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు నెలకొలపడం ఖాయం. తెలంగాణ గడ్డపై అత్యధిక కాలం పనిచేసిన సీఎం గా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారు. రాష్ట్ర ప్రజలంతా కారు, సారు, కేసీఆర్, బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. ఇన్ని మంచి పథకాలు ఎక్కడా లేవు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ మోడల్ వైపు చూస్తున్నాయి, కేసీఆర్ ప్రధాని కావాలన్నది దేశ ప్రజల మనోగతం. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ పాలన చూసి సబ్బండ వర్గాలు గులాబీ గూటికి చేరుతున్నాయి. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఆర్మూర్ నియోజకవర్గం మారింది. ప్రజల అండతో నేను మళ్లీ గెలుస్తా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News