Saturday, November 23, 2024
HomeతెలంగాణAruri Ramesh: లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యం

Aruri Ramesh: లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యం

ప్రతి ఓటరుకు మ్యానిఫెస్టో వివరించండి

లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలనీ బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. హసన్ పర్తి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బూతు ఇంచార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే అరూరి రమేష్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. రానున్న 28 రోజులు ప్రతీ కార్యకర్త బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ కోరారు. గ్రామాలలోని ప్రతీ ఓటరు దగ్గరకి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గత పది ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలపాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అంశాలను కులంకుశంగా వివరించాలని తెలిపారు. మండల పరిధిలోని గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి పనులను గ్రామస్తులతో చర్చించాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల టెంపరరీ లీడర్లు ఏమీ చేయలేరని అన్నారు. వర్దన్నపేట నియోజకవర్గ ప్రజల మద్దతు పూర్తిగా బిఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా లక్ష ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పార్టీ ఎన్నికల పరిశీలకులు సత్య ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు రజిని కుమార్, ఎంపిపి సునీత, జెడ్పీటీసీ సునీత, వైస్ ఎంపిపి రత్నాకర్ రెడ్డి, రైతు బందు కో ఆర్డినేటర్ విజయ్, పాక్స్ చైర్మన్ రమేష్, మాజి జెడ్పీటీసీ సుభాష్, మండల యూత్ అధ్యక్షులు భగవాన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News