Tuesday, September 17, 2024
HomeతెలంగాణChocoloate Death : చిన్నారి ప్రాణం తీసిన చాక్లెట్

Chocoloate Death : చిన్నారి ప్రాణం తీసిన చాక్లెట్

ఇంట్లో పిల్లలు మారాం చేస్తే.. వాళ్లకి బిస్కెట్లు, చాక్లెట్లు కొనివ్వడం మామూలే. కానీ ఆ చాక్లెట్లు పెద్దగా ఉంటే.. మొత్తం ఒకేసారి తినేయాలన్న ఆతృతగా ఉంటారు పిల్లలు. ఇప్పుడదే ఓ చిన్నారి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌కు చెందిన కన్‌గహాన్‌ సింగ్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్ కి వలస వచ్చాడు. జేపీఎన్ రోడ్డులో ఎలక్ట్రిక్ షాపు నడుపుతూ.. కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతనికి భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇటీవల వ్యాపారం నిమిత్తం సింగ్ ఆస్ట్రేలియా వెళ్లాడు.

- Advertisement -

విదేశాలకు వెళ్లిన వారెవరైనా తమ పిల్లలకోసం ఏదొకటి తీసుకొస్తుంటారు. సింగ్ కూడా తన పిల్లలకోసం అక్కడ ప్రత్యేకంగా దొరికే ఖరీదైన చాక్లెట్లను తీసుకొచ్చాడు. తాజాగా సింగ్ రెండో కొడుకైన 8 ఏళ్ల సందీప్.. స్కూల్‌కి వెళ్తుండగా.. తల్లి గీత ఆ చాక్లెట్లు ఇచ్చింది. వాటిని తింటూనే.. మిగతా పిల్లలతో కలిసి స్కూల్‌కి వెళ్లాడు. స్కూల్‌కి వెళ్లాక.. క్లాసులో పాఠాలు చెబుతున్న టీచర్ కు సందీప్ నిద్రపోతున్నట్లుగా కనిపించాడు. టీచర్ తనను కదపగా.. కదల్లేదు. వెంటనే తండ్రి సింగ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. హుటాహుటిన స్కూల్ కి వెళ్లి.. సందీప్ ను ఎంజీఎం కు తీసుకెళ్లాడు. అప్పటికే సందీప్ పరిస్థితి విషమంగా మారింది. బ్రెయిన్‌ కి ఆక్సిజన్ సరఫరా బాగా తగ్గిపోయింది. డాక్టర్లు చికిత్స చేస్తుండగానే సందీప్ చనిపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కుపోవడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News