తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య విద్యార్థులకు చెల్లిస్తున్న స్టైఫండ్ ను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఎర్రగడ్డ ఆయుర్వేద వైద్యశాలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు నిఖిత,సంధ్యలు మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు స్టైఫండ్ ను 15 శాతం పెంచాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత పది సంవత్సరాల నుంచి పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆయుర్వేద వైద్య విద్యార్థులకు స్టైఫండ్ పెంచాలని తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చే స్టైఫండ్ సరిపోక తాము ఎన్నో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని
వాపోయారు. ఈ విషయంపై ఇప్పటికే ఆయుష్ కమిషనర్, వైద్య శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా తాము నిరసనలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీజీ విధ్యార్థులు తుమ్మ శ్రీనివాస్, జగన్ లాల్, శ్రీ హర్ష, సలాన రాంబాబు, సందీప్ అలేటి, సంధ్య, శ్రావణి, సహన, ఇంటర్న్ లు సంతోష్, శశాంక్, ప్రీతి తదితరులు పాల్గొన్నారు.
Ayurveda students agitation: వైద్య విద్యార్థుల స్టైఫండ్ ను పెంచాలి
తెలంగాణ ఆయుర్వేద వైద్య విద్యార్థుల నిరసన