Sunday, November 16, 2025
HomeతెలంగాణBalapur Ganesh: బాలాపూర్ లంబోదరుడికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంతో తెలిస్తే షాకే!

Balapur Ganesh: బాలాపూర్ లంబోదరుడికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంతో తెలిస్తే షాకే!

Balapur hundi income: బాలాపూర్.. ఆ పేరు వింటేనే గుర్తొచ్చేది లడ్డూ వేలం. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే.. వారి ఇంట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటి బాలాపూర్ గణనాథుడి మండపాన్ని ఈసారి నిర్వాహకులు స్వర్ణగిరి ఆలయ నమూనాలో ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆర్షించారు. దీంతో హైదరాబాద్ నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సైతం.. బాలాపూర్ గణేశుడి దర్శనంతో పాటు స్వర్ణగిరి సెట్‌‌ను కనులారా వీక్షించారు. గతంలో కంటే ఈ ఏడాది భక్తులు అధికంగా రావడంతో..బాలాపూర్ హుండీ ఆదాయం సైతం భారీగా పెరిగింది. 11 రోజుల ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు ఏకంగా రూ.23,13,760 కానుకల రూపంలో సమర్పించుకున్నారు. దీంతో లడ్డూ వేలం పాటే కాదు.. హుండీ ఆదాయంలో సైతం బాలాపూర్ లంబోదరుడు రికార్డు నెలకొల్పాడు.

- Advertisement -

Balapur Laddu Auction 2025: గణేష్ పండుగంటే గల్లీ నుంచి దిల్లీ వరకు మాములుగా ఉండదు. ముఖ్యంగా ఈ ఉత్సవాల్లో లడ్డూ వేలం పాట ప్రత్యేకతను సొంతరించుకుంది. ఇందులోనూ బాలాపూర్‌ గణేశుడు లడ్డు వేలం రికార్డు స్థాయి ధరతో ప్రత్యేక గుర్తింపు పొందింది . ఈసారి ఏకంగా రూ. 35 లక్షల ధర పలికింది. లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు.

బాలాపూర్ చరిత్ర – వేలం పాటకు రికార్డ్స్​ బ్రేక్​​​: బాలాపూర్‌లో ప్రతిష్టించే గణపతికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాగ్యనగరంలో బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాటకు ఘనమైన చరిత్ర ఉంది. లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకుంటే… వారి ఇంట సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బాలాపూర్‌లో తొలిసారిగా 1980లో గణేశుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించినట్లు తెలిపారు. తొలి వేలం పాటలో రూ.450కి స్థానిక వ్యక్తి కొలను మోహన్​రెడ్డి దక్కించుకున్నారు.

లడ్డు వారింట కొంగుబంగారం: మెుదటిసారి 1994లో లడ్డును పొందిన కొలను మోహన్​రెడ్డి కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటుగా.. వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. వారికి ఆ ఏడాది అన్ని పనుల్లోనూ మంచి జరిగింది. లడ్డు వారింట కొంగుబంగారం అయ్యింది. బాలాపూర్ లడ్డు పొందడం ద్వారానే కలిసొచ్చిందని వారి నమ్మకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad