Friday, April 4, 2025
HomeతెలంగాణBalka Suman: చెన్నూరే నా బలం, బలగం

Balka Suman: చెన్నూరే నా బలం, బలగం

చెన్నూర్ నియోజకవర్గంలో ఎప్పుడు బాల్క సుమన్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అంటూ ప్రతి ఒక్కరి నోటా ఆపదమే… చెన్నూరు పట్టణంలోని ఎమ్.ఆర్.ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్యాధితులుగా ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బిఆరెస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ పాల్గొని మాట్లాడుతూ… చెన్నూరు పట్టణ ప్రగతి నివేదన మహా అద్భుతంగా ఉంధన్నారు. చెన్నూరు పట్టణంలో 30 కోట్లతో వంద పడకల ఆసుపత్రికి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేపించిన ఘనత బాల్క సుమన్ కే దక్కుతుంది. ఏడు కోట్లతో మాతా శిశు సంక్షేమ దవఖాన పూర్తి కావస్తుందన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా బిఆరెస్ పార్టీ ఇంచార్జ్ నారాదాసు లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మున్సిపల్ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News