తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 9వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో నస్పూర్ లోని సింగరేణి సిసిసి గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, బిఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా|| బాల్క సుమన్ మాట్లాడుతూ… 21 రోజల పాటు నిర్వహించే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర పురోగతిని, ప్రగతిని, సంక్షేమాన్ని వివరించేలా గొప్పగా నిర్వహించాలి. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయాలి. ఈ కార్యక్రమాలలో గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలలో ప్రజాప్రతినిధులు విధిగా పాల్గొనాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, సింగరేణి సంస్థ సమన్వయంతో పనిచేసి ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలి. విద్యుత్, పరిశ్రమలు, మతకలహాలు, నీటి యుద్ధాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చెందింది. తలసరి ఆదాయం విద్యుత్ వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సంక్షేమపథకాలు, మౌలిక వసతులు కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ. సంపదను పెంచుతూ పేద ప్రజలకు పంచుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేడు ఏ పథకమైనా తెలంగాణ ప్రారంభిస్తుంది దేశం ఆచరిస్తుంది. నేడు తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, భూ పంచాయతీలు లేవు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు పండించిన ప్రతి గింజలను కొంటున్నాం. రబీ సీజన్లో కూడా పంటను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే బండ్ల లైసెన్స్ రద్దు చేస్తాం. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.