చెన్నూరు పట్టణంలోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చెన్నూర్ మండల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ సందర్భంగా పార్టీ విధివిధానాలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు విప్. మండలానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. భోజన విరామం అనంతరం తరువాత మండలంలోని గ్రామాల వారీగా సమ్మేళన కార్యక్రమాన్ని కొనసాగించారు. 60 ఏళ్లుగా నక్సల్ ప్రభావిత ప్రాంతమని, కల్లోలిత ప్రాంతమని నిందలు వేసి అభివృద్ధి జరగనివ్వ లేదంటూ సుమన్ గతాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెందుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ తమ ప్రభుత్వంపై కక్ష కట్టిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలను గడప గడపకూ మోసుకెళ్లి కార్యకర్తలు వివరించాలన్నారు సుమన్.
ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.