Sunday, June 22, 2025
HomeతెలంగాణBandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు: బండి

Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు: బండి

Bandi Sanjay Comments: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి రక్షిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ అవినీతి చేసినట్లు ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి బీజేపీపై బుదర చల్లాలని చూస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానిని ఏటీఎంగా మారిందంటూ ఆరోపణలు చేశారు. ఏ ఆధారాల్లేకుండా కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని చెబుతారా? అని తెలిపారు. ఊసరవెల్లిలా స్టాండ్ మారించే పార్టీ కాదు బీజేపీ అని స్పష్టం చేశారు.

కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని గతంలో రాహుల్ గాంధీ చేసిన డిమాండ్‌ను గుర్తుచేశారు. కేబినెట్ ఆమోదం, సబ్ కమిటీ సిఫారుసులతో కాళేశ్వరం కట్టారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం చూస్తుంటే తప్పించుకోవడానికి చూస్తున్నట్లు ఉందని తెలిపారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నా తన స్టాండ్ మారలేదన్నారు. తప్పు జరిగితే జరిగిందనే చెబుతామని.. అదే బీజేపీ స్టాండ్ అని పేర్కొన్నారు.

రూ.38 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును రూ.1.2 లక్షల కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ దోచుకున్నది ముమ్మాటికీ నిజమని ఆరోపణలు చేశారు.ఈ ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు వందల కోట్ల రూపాయలు సంపాదించారంటే ఎంత అవినీతి జరిగిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఇన్ని ఆధారాలున్నా కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కు రాజకీయాలు ప్రజలకు తెలిసిపోయాయని వెల్లడించారు. అందుకే బీజేపీకి అధికారం అప్పగిద్దాం అనే నిర్ణయానికి వచ్చేశారని తెలిపారు.

ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టును సమర్థించడం పెద్ద తప్పన్నారు. బీజేపీలో ఉంటే పార్టీ స్టాండ్ మాత్రమే మాట్లాడాలని.. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. కాగా గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఈటల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News