Monday, November 17, 2025
HomeతెలంగాణBanoth Sankar Naik: నామినేషన్ దాఖలు చేసిన బానోత్ శంకర్ నాయక్

Banoth Sankar Naik: నామినేషన్ దాఖలు చేసిన బానోత్ శంకర్ నాయక్

సత్యవతి రాథోడ్ హాజరు

మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బానోత్ శంకర్ నాయక్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ కార్యాలయంలో సమర్పించారు. ఈ సందర్భంగా బానోత్ శంకర్ నాయక్
అంజన్న అండ, అయ్యప్ప అనుగ్రహంతో ఆయా దేవాలయాల్లో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానుకోట ప్రజల ఆశీర్వాదంతో పల్లె పల్లెలో కదం తొక్కి, కాంగ్రెసుపై పోరు చేసి తమ సంక్షేమ సారథి కేసీఆర్ కు అండగా నిలువబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగన్న, కుమారి తేజస్విని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad