Monday, November 17, 2025
HomeతెలంగాణShankar Naik: కేసీఆర్ పాలన అన్ని పార్టీలను ఆకర్షిస్తోంది

Shankar Naik: కేసీఆర్ పాలన అన్ని పార్టీలను ఆకర్షిస్తోంది

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటాం..

సీఎం కెసిఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలే వివిధ పార్టీల్లో ఉన్న వారిని బిఆర్ ఎస్ పార్టీలోకి రావడానికి కారణం అవుతున్నాయని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు కేసముద్రము బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మేల్యే స్వయంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటూ వారికి ఉన్నత పదవులు ఇస్తామని సీఎం కెసిఆర్ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పని చేయాలని ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి పార్టీ నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad