Thursday, April 10, 2025
HomeతెలంగాణBanoth Shankar: ఘనంగా సంక్షేమ పథకాల దినోత్సవం

Banoth Shankar: ఘనంగా సంక్షేమ పథకాల దినోత్సవం

వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ చెక్కులను, గొర్రెలు, వివిధ కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందజేత

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నెల్లికుదుర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల దినోత్సవ మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, శాదీ ముబారక్ చెక్కులను, గొర్రెలు, వివిధ కుల వృత్తుల వారికి ఆర్థిక సాయాన్ని, ఓవర్సీస్ స్కాలర్ షిప్ ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలను సమంగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మార్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు, జెడ్పిటిసిలు, సర్పంచ్ లు, భారాస నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News