తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరిగిన “ఆధ్యాత్మిక దినోత్సవం” లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. గుడిమెట్ పిఠాదిపతి మహాదేవ్ మహారాజ్ గారు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, RDO రాజా గౌడ్, ఆలయ ధర్మకర్తలు పోచారం శంభురెడ్డి దంపతులు, ప్రజాప్రతినిధులు,తిరుమల బ్యాంకు చైర్మన్ చంద్రశేఖర్ దంపతులు, నాయకులు, దేవాదాయ శాఖ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సుదర్శన యాగం తరువాత స్పీకర్ పోచారం మాట్లాడుతూ…పరిపాలనలో అన్ని రంగాలు ముఖ్యమే అయినా అందరికీ అవసరమైనది ఆధ్యాత్మికమన్నారు. కులం, మతం ఏదైనా సంస్కారం ప్రధానం. మనిషిలో మంచి నడవడిక రావాలంటే ఆధ్యాత్మిక బాట అవసరమన్నారు పోచారం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత అనేక మార్పులు వచ్చాయి. వాటిని ప్రజలకు వివరించడానికే ప్రతి ఒక్క ముఖ్యమైన అంశంతో ఒక్కో రోజు ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు.
ముఖ్యమంత్రి 2015లో బాన్సువాడ సమీపంలోని ఈ తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చినప్పుడు ఆయన మనసుకు ఈ పరిసరాలు నచ్చి ఆలయం విస్తరణ, వసతులకు ఇప్పటి వరకు విడతల వారిగా మొత్తం 30 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 2014 నుండి బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు, మందిరాల అభివృద్ధికి దేవాదాయ శాఖ స్పెషల్ డెవల్ప్ మెంట్ నిధుల ద్వారా రూ.150 కోట్లు ఖర్చు చేశామన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు తొంబై దేవాలయాలలోని అర్చకులకు వేతనాలు అందుతున్నాయి.