పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో తాను వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన బాన్సువాడలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి హాజరై గ్రాడ్యుయేట్లతో చర్చించారు.
- Advertisement -
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరై మాట్లాడారు. విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో తన గొంతు వినిపిస్తానన్నారు. శాసన మండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా తయారైందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.