Sunday, October 6, 2024
HomeతెలంగాణBansuvada: తెలంగాణ విద్యాదినోత్సవంలో పోచారం

Bansuvada: తెలంగాణ విద్యాదినోత్సవంలో పోచారం

మారుమూల ప్రాంతాల్లోనూ నాణ్యమైన విద్య

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా బీర్కూర్ మండల కేంద్రంలో జరిగిన “తెలంగాణ విద్యాదినోత్సవం” లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా రైతుబంధు అధ్యక్షులు డి అంజిరెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ… పట్టణాలలోని ధనవంతుల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య మారుమూల ప్రాంతాల్లోని పేదల పిల్లలకు కూడా అందాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమన్నారు.

విద్యావంతుడు, ఆలోచన పరుడైన ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అన్నారు పోచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News