బషీరాబాద్ మండలం మంతటి గ్రామములో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ దశరథ్ సమక్షంలో బలగం సినిమా నా గ్రామ ప్రజలు నా బలగం అంటూ సినిమా చూపించారు. సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయాలు, కుటుంబ బంధాలపై తెరకెక్కించిన బలగం సినిమా ఎంతో ఆదరణ పొందింది. ఈ సినిమాల్లో అనుబంధాలు సన్నివేశాలు అందరినీ కంటి తడి పెట్టిస్తున్న విషయం తెలిసిందే. బలగం సినిమా గ్రామ గ్రామంలో పట్టణాల్లో ఇతర ప్రదర్శన జరుగుతున్నాయి. నా గ్రామం నా ప్రజలు నా బలగం అంటూ సినిమా చూపించటం విశేషం. సినిమా చూసిన గ్రామస్థులంతా సంతోష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.