Thursday, September 19, 2024
HomeతెలంగాణBasheerabad: సీఎం కప్ క్రీడలు ఆడుకుందాం

Basheerabad: సీఎం కప్ క్రీడలు ఆడుకుందాం

బషీరాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రెండవ రోజు సీఎం కప్ క్రీడా పోటీలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రీడా పోటీల చైర్మన్ ఎంపీపీ కరుణ వాలీబాల్ ఆడే టీం లీడర్స్ తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎం కప్ అనే నినాదంతో క్రీడా పోటీలు కనుమరుగైతున్నాయని సమ్మర్ క్రీడా పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. ఈ క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని అన్నారు. వాలీబాల్, కోకో, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడల్లో స్త్రీలు కూడా ముందడుగు వేయాలని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ క్రికెట్ పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్, జూనియర్ అసిస్టెంట్ షేర్ఖాన్, ఫిజికల్ డైరెక్టర్స్ గోపాల్, సుధాకర్, ఏఎన్ఎం నర్సులు, ఆశ వర్కర్లు, పలువురు బిఆర్ఎస్ నాయకులు, పలు గ్రామ యువకులు తదితరులు ఉన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News