Monday, November 17, 2025
HomeతెలంగాణBasheerabad: కస్తూర్బా హాస్టల్లో ఉడికి ఉడకని బువ్వ, నీళ్లచారు

Basheerabad: కస్తూర్బా హాస్టల్లో ఉడికి ఉడకని బువ్వ, నీళ్లచారు

బషీరాబాద్ మండల కేంద్రంలో కస్తూర్బా హాస్టల్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని అన్నం సాంబార్ తోనే సరిపెడ్తున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ వీరేశం బాబు ఆకస్మిత తనిఖీ చేయగా విద్యార్థులు డిప్యూటీ తాసిల్దార్ ముందు మాట్లాడుతూ మాకు సరైన భోజనము పెట్టడం లేదు ఉడికి ఉడకని అన్నము నీళ్ల చారు వడ్డిస్తున్నారు, కూరగాయలు పెట్టమని అడగగా కుళ్ళిపోయిన గుడ్లను మాకు వడ్డిస్తున్నారు కూరగాయలు వండుకొని ప్రత్యేకంగా టీచర్లు మాత్రమే తింటారు, ప్రతిరోజు భోజనములో ఇసుక రవ్వలు అప్పుడప్పుడు పురుగులు వస్తున్నాయి, ఎవరికి చెప్పుకోలేక సతమతమవుతున్నాము, ఈ స్కూల్ కు ప్రత్యేక అధికారులు కరువయ్యాయని వాపోయారు.

- Advertisement -

ప్రతినిధి హనుమంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో డిప్యూటీ తాసిల్దార్ తో విలేకరులతో పర్యవేక్షించగా అక్కడ ఉన్న ఎస్ఓ సిబ్బంది ఫోన్ల రికార్డు చేశారు. మొత్తం విషయాన్ని రికార్డు చేస్తున్న జర్నలిస్టులతో వారు వాదోపవాదాలకు దిగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad