Friday, November 22, 2024
HomeతెలంగాణBCs: బీసీ చరిత్రలో సువర్ణాధ్యాయం, 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన

BCs: బీసీ చరిత్రలో సువర్ణాధ్యాయం, 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన

వెనుకబడిన వర్గాల చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోయేలా.. హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన వేల కోట్ల విలువైన స్థలాల్లో బీసీ ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. 13 బిసి సంఘాలు ఉప్పల్ భగాయత్లో సామూహికంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. ప్రతీ కుల సంఘ భవనం శిలాఫలకం వద్దకు స్వయంగా వెళ్ళిన మంత్రులు శాస్త్రోక్త్తంగా పూజలు నిర్వహించి నవధాన్యాలతో భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన బీసీ కుల సంఘాల ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బీసీలు, ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభా వేదికగా ప్రసంగించారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వెనకబడిన వర్గాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారే అన్నారు. ఉప్పల్ భగాయత్లో 13 కుల సంఘాలకు 18.3 ఎకరాలలో దాదాపు 17 కోట్లతో నిర్మించే భవనాలకు భూమి పూజ చేసుకున్నామన్నారు. మొత్తం ఉప్పల్ బగాయత్లో 22 కులాలకు 38 ఎకరాలు కేటాయించామన్నారు. దసరా నాటికల్లా వీటిలో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని ఆయా సంఘాలకు సూచించారు మంత్రి గంగుల. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం యొక్క ప్రతిష్ట ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకోవడానికి ఆయా కుల సంఘాలకే సంపూర్ణ అధికారం కూడా సీఎం కేసీఆర్ గారు కల్పించారని గుర్తు చేశారు మంత్రి గంగుల.
తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం చేపట్టిన అది బీసీలకు అత్యధిక మేలు చేసే విధంగానే రూపొందిస్తుందని, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, గురుకులాలు ఇలా ప్రతి ఒక్కదాంట్లో బీసీల వాటాను సగర్వంగా తీసుకుంటున్నామన్నారు మంత్రి గంగుల.
శంకుస్థాపనలు చేసుకున్న 13 సంఘాల వివరాలు..
1. గంగ పుత్ర – 3 ఎకరాలు – 3 కోట్లు. 2. నీలి – 10 గుంటలు – 25 లక్షలు, 3. లక్కమరికాపు –20 గుంటలు, 4. తెలంగాణ మరాఠా మండల్ – 2 ఎకరాలు, 5. పూసల – 1ఎకరాం – 1కోటి, 6. కుమ్మరి శాలివాహన – 3 ఎకరాలు – 3 కోట్లు, 7. విశ్వభ్రాహ్మణ – 5 ఎకరాలు – 5 కోట్లు, 8. నక్కాస్ – 1 ఎకరం – 1 కోటి, 9. బొందిలి – 1 ఎకరా – 1 కోటి, 10. కాచి – 20 గుంటలు – 50 లక్షలు, 11. వాల్మీకి బోయ – 1 ఎకరా – 1 కోటి, 12. భూంజ్వ – 10 గుంటలు – 25 లక్షలు, 13. జాండ్ర–10 గుంటలు –25 లక్షలు.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News