Sunday, November 16, 2025
HomeతెలంగాణBC Bundh: బీసీలకు అన్యాయం జరిగితే భూకంపమే.. రేపు బంద్‌లో అందరూ పాల్గొనాలి: ఆర్ కృష్ణయ్య

BC Bundh: బీసీలకు అన్యాయం జరిగితే భూకంపమే.. రేపు బంద్‌లో అందరూ పాల్గొనాలి: ఆర్ కృష్ణయ్య

R Krishnaiah on BC Bundh: బీసీలకు అన్యాయం జరిగితే తమ ఉద్యమం ద్వారా ‘భూకంపాన్ని’ సృష్టిస్తామని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య తీవ్రంగా హెచ్చరించారు. బీసీల సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా అక్టోబర్ 18న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌లో బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ బంద్ సెగ దేశ రాజధాని ఢిల్లీకి తాకాలని ఆయన ఆకాంక్షించారు.

- Advertisement -

హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ మీడియా సమావేశానికి హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ పోరాటం కేవలం ఒక వర్గానికో, పార్టీకో కాదని, బీసీలందరి ఆత్మగౌరవం, హక్కుల కోసమని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా మిగతా అన్ని విభాగాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని ఆయన కోరారు. బంద్‌కు సహకరించకపోతే తమ కార్యకర్తలు బలవంతంగా మూసివేయిస్తారని హెచ్చరిక జారీ చేశారు.

బీసీ జర్నలిస్టు అసోసియేషన్ తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించడంపై ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆయన గతంలో ఎన్టీఆర్, విజయభాస్కర్ రెడ్డి హయాంలో చేసిన పోరాటాలను గుర్తుచేసుకుంటూ, పేదరికం అధికంగా బీసీల్లోనే ఉందని, వారి మంచి కోసమే తాను పార్టీలకు అతీతంగా పోరాడుతున్నానని తెలిపారు.

ఈ బంద్‌కు మద్దతుగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ జేఏసీ సభ్యులు కూడా మాట్లాడారు.

జర్నలిస్టులు ‘జై బీసీ’ ఉద్యమానికి తమ కలం, గళాన్ని ఆయుధాలుగా అందించాలి. మీడియా సంస్థలకు బీసీలే మూల స్తంభాలు.

– దాసు సురేశ్ (బీసీ జేఏసీ సభ్యుడు):

బంద్ ఫర్ జస్టిస్ ద్వారా కేంద్ర, రాష్ట్ర పీఠాలు కదలాలని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడం బీసీల పట్ల వ్యవస్థలు వ్యతిరేకంగా ఉన్నాయనడానికి నిదర్శనం.

– వీజీఆర్ నారగోని (జేఏసీ వైస్ చైర్మన్):

బీసీలకు రాజ్యాంగ సవరణ ఒక్కటే శ్రీరామరక్ష అని, హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ పూర్తి బాధ్యత వహించాలి.

– రాజారాం యాదవ్ (బీసీ జేఏసీ కో చైర్మన్):

ఏ కోర్టూ తమకు న్యాయం చేయలేదని, అందుకే కోర్టులపై నమ్మకం లేదు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిసి నిర్ణయం తీసుకుంటే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది, లేదంటే తమ సత్తా ఏంటో చూపిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే బీసీ ఉద్యమం ఊపందుకుంటుంది.

జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్).

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad