ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో
ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క కామెంట్స్
పరాయి పాలనలో మగ్గిపోతున్న భరతమాత దాస్య శృంకలాలను తెంపి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి 1985 డిసెంబర్ 28న కాంగ్రెస్ ఆవిర్భవించింది. అఖిల భారత కాంగ్రెస్ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28న ఈ రోజు దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించబడినది. దశాబ్దాలుగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఆనాటి వీరులు, త్యాగాలు చేసిన గొప్ప వాళ్లను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ సమాజం కావాలని ఆశించిన ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరక గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలనలో మగ్గిపోయారు.
తెచ్చుకున్న తెలంగాణ పాలన ప్రజల కోసమే తప్పా పాలకుల కోసం కాదని, పదేళ్లుగా కాంగ్రెస్ పోరాటం చేసి ప్రజలను చైతన్యం చేసి ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం పాలన తెచ్చాము. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి దరఖాస్తులను స్వీకరించడానికి కాంగ్రెస్ ఆవిర్భావం రోజున ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు గ్రామాల్లో సభలు పెట్టి పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ చేస్తున్నాము. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు గృహ జ్యోతి మహాలక్ష్మి రైతు భరోసా పథకాలు అందించడానికి అంకితభావంతో ప్రజాపాలన నేటి నుంచి మొదలైంది.
ఇది దొరల ప్రభుత్వం కాదు. ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజల ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు అని ప్రతిపక్షం కోరుకోవడం అంటే ప్రజలు బాగుపడడం వారికి ఇష్టం లేనట్టుంది. గత 9 సంవత్సరాల్లో రేషన్ కార్డులు, ఇండ్లు మంజూరు చేయని
బిఆర్ఎస్ ది దుర్మార్గపు పాలన. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పేరిట నేను చేసిన పాదయాత్రలో అనేక మంది మహిళలు వచ్చి ఈ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు, ఇండ్లు, భూములు ఇస్తారని తలెత్తుకొని ఆత్మగౌరంతో బతుకొచ్చని ఆశించగా గత ప్రభుత్వాలు పంచిన భూములను కూడా బలవంతంగా గుంజుకున్నారని అడిగితే వేధింపులు ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఈ పాలన మాకొద్దు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని ఆనాడు ప్రజలు వేడుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అంకితం చేయడమే మా ప్రజా పాలన. ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు ప్రతి గ్రామంలో 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశాము. ప్రతి కౌంటర్ కు అధికారులను నియమించాం. జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఏ ఒక్క వర్గానికి, ఒక వ్యక్తులకు సంబంధించిన ప్రభుత్వం మాది కాదు. ఇది అందరి ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరిగా మా పార్టీలోకి వస్తేనే మా పార్టీ కండువాలు కప్పుకుంటేనే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పం అలాంటి బెదిరింపులు ఈ పాలనలో ఉండవు. మేము ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అందరికీ ఇస్తాం. ఈ రాష్ట్ర బిడ్డలందరికీ ఆరు గ్యారెంటీలు ఇస్తాం ఇందులో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండదు. ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ పోలీస్ ప్రతి వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగించే బాధ్యతగా ఇందిరమ్మ రాజ్యపాలన ఉంటుంది.
ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే బాగుండు అని బిఆర్ఎస్ కోరుకున్నటువంటి ఆశలు నిజం కానివ్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంట లోపు రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించడానికి ఫ్రీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టాం. మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ పథకం విజయవంతంగా అమలవుతుంది. కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
నా పాదయాత్రలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్ కి వచ్చిన సందర్భంగా ఇల్లు లేని పేదలు నన్ను కలిశారు అధికారంలోకి రాగానే అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు నిర్మాణానికి డబ్బులు ఇస్తామని ఆనాడు మాట ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షలు రూపాయలు మంజూరు చేస్తున్నాం.