Monday, November 17, 2025
HomeతెలంగాణBhimadevarapalli: నిరుపేదల నేస్తం ఆపదలో ఆపన్న హస్తం

Bhimadevarapalli: నిరుపేదల నేస్తం ఆపదలో ఆపన్న హస్తం

ట్రస్ట్ ఆధ్వర్యం లో పలు సేవా కార్యక్రమాలు

భీమదేవరపల్లి మండల వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, బీద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్న పెద్ది వసంత గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్ శనివారం నాడు గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన రచ్చ రాధమ్మ కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మండల వ్యాప్తంగా ఆర్థికంగా, సామాజికంగా, వెనుకబడిన కుటుంబాలకు, దివ్యాంగులకు ట్రస్ట్ ఆధ్వర్యం లో పలు సేవా కార్యక్రమాలు చేపడతానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఊసకోయిల ప్రకాష్, బీసీ సెల్ మండల అధ్యక్షులు పొన్నాల మురళి, సామల లింగమూర్తి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొల్లంపల్లి రాజయ్య, గూళ్ల పూర్ణచందర్, సట్ల మధు,కవ్వంపల్లి స్వర్ణలత, అంబాల రాజ్ కుమార్, బొల్లంపల్లి కాంతారావు, రంగు మణిదీప్ గౌడ్, నాగరబోయిన నాగరాజు పెద్దబోయిన హరికృష్ణ, బొల్లంపల్లి రంజిత్, మాడుగుల అమర్, జనగాం బిక్షపతి,జక్కుల మచ్చగిరి, బరిగే సాయిలు, పల్లపు ప్రవీణ్, గాజు రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad