Thursday, July 4, 2024
HomeతెలంగాణBhimadevarapalli: హుస్నాబాద్ లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటన

Bhimadevarapalli: హుస్నాబాద్ లో మంత్రి పొన్నం సుడిగాలి పర్యటన

21 నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తా

తెలంగాణ రాష్ట్ర రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా భీమదేవరపల్లి మండలం లో మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో విస్తృత సమావేశంలో ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ లో తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.

- Advertisement -

ప్రజల నుండి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందులో తక్షణమే పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్ , తాగు నీటి లేకుండా చూడాలని, స్కూల్ లలో జరుగుతున్న పనులు ఏమైనా పెండింగ్ లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా దోమల విషయంలో కూడా ముందస్తు జాగ్రతలు చేపట్టాలని తెలిపారు.

గ్రామ గ్రామాన పర్యటన ఖరారు..

పలు గ్రామాలకు ఆర్టీసి బస్సు రావడం లేదని ,సీసీ రోడ్ల నిర్మాణం,మురుగు కాలువల నిర్మాణం లాంటివి పూర్తి చేయాలని స్థానిక ప్రజలు మంత్రిని కోరారు. తనని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని వారు ఇచ్చిన అవకాశంతో మంత్రి అయి, సేవ చేయడానికి వచ్చానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని ఎంతా బిజీగా ఉన్నా తనని గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చడానికి నేరుగా మండలాలు గ్రామాల్లోకి వస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని ఎప్పటికీ హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం వెల్లడించారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా నిలబెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిట్టెంపల్లి ఐలయ్య , మాజీ ఎంపిపి కోడూరి సరోజన, మహిళా అధ్యక్షురాలు చిదురాల స్వరూప, కర్ణకంటి మంజుల రెడ్డి, అశోక్ ముఖర్జీ, కొలుగురి రాజు, ఆదరి రవి, మండలంలోని వివిధ గ్రామల గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News