Sunday, October 6, 2024
HomeతెలంగాణBhupalapalli: నాడు అద్భుతం..నేడు అధ్వాన్నం

Bhupalapalli: నాడు అద్భుతం..నేడు అధ్వాన్నం

ప్రమాదంలో లక్ష్మి సరస్వతి బ్యారేజీలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ లు కూలిపోవడం ఖాయమని, అన్నారం సరస్వతి బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. నాడు కాలేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని అనేకమంది నిపుణులు, రాజకీయ నాయకులు ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతలోనే ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది.గత బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత కీలకంగా భావించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానం జిల్లాలోని మేడిగడ్డ నుండే ప్రారంభమైంది. గోదావరి జలాలను ఒదిమి పట్టిన జిల్లాగా ఖ్యాతి గడించిన జిల్లాలోని రెండు బ్యారేజీల పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో పలువురు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈఎన్సి మురళీ ధరరావును రాజీనామా చేయాలని ఆదేశించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరో ఈఎన్సి నల్ల వెంకటేశ్వర్ ను సర్వీస్ నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించడం నీటిపారుదల రంగంలో ఆ సాధారణ విషయంగా చెప్పుకుంటున్నారు. జిల్లాలోని లక్ష్మీ, సరస్వతి బ్యారేజీలు ప్రమాద స్థాయిలో ఉన్నట్లు సాక్షాత్తు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో దూర ప్రాంతాల వారు జిల్లాలోని పలువురితో బ్యారేజీల స్థితిగతులపై అడిగి తెలుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News