బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియకు(Vishnupriya) తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లు క్వాష్ చేయాలంటూ హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎఫ్‌ఐఆర్ కొట్టివేసేందుకు, దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని విష్ణుప్రియకు సూచించింది. ఇదే సమయంలో ఆమెను అరెస్ట్ చేయకుండా చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియతో పాటు మరో 11 మందిపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు తీసుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 25 మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.