బీర్కూర్ మండల కేంద్రం-బరంగెడ్గి గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి. బీర్కూర్ మండల కేంద్రంలో రూ. 7.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్, సైడ్ డ్రైనేజీ లతో నూతనంఖా నిర్మించే ఫోర్ లైన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 1.10 కోట్లతో బీర్కూర్ నుండి మల్లాపూర్ క్యాంపు మీదుగా TTD వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు వేయనున్న సిసీ రోడ్డు, రూ. 10 లక్షలతో నిర్మించే మున్నూరు కాపు సంఘం ప్రహారి గోడకు స్పీకర్ పోచారం శంకుస్థాపన చేశారు. బరంగెడ్గి గ్రామంలో జరిగిన సప్త లో పాల్గొన్న స్పీకర్ పోచారం గారు రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించే పరమేశ్వరుడి ఆలయానికి భూమి పూజ చేశారు. అనంతరం బీర్కూర్ మున్నూరు కాపు సంఘం భవనంలో జరిగిన సభలో సభాపతి పోచారం మాట్లాడుతూ.. రహదారుల నిర్మాణంతో ప్రజలకు సౌకర్యం కలుగుతుంది, వ్యాపార అవ చేకాశాలు పెరిగి అభివృద్ధి అవుతోందన్నారు. వాహనాలు పెరగడంతో రహదారులను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో నాలుగు వరుసల రహదారిని డివైడర్, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైయిన్ తో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే బాన్సువాడ, వర్ని, మోస్రా, చందూరు లలో పూర్తి చేశామని, ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని విస్తరించి నూతనంగా వేయడానికి నిధులు మంజూరు చేయాలని నేను గతంలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ గారికి వినతిపత్రం అందజేసినట్టు గుర్తుచేశారు.
ఈ రోడ్డు నిర్మాణం కోసం రూ. 500 కోట్లు మంజూరు అయ్యాయvf, మెదక్-రుద్రూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రుద్రూరు, నస్రుల్లాబాద్ మండల కేంద్రాలలో కూడా ఫోర్ లైన్ నిర్మాణం అవుతుందన్నారు. మద్నూర్ నుండి పోతంగల్ మీదుగా బోదన్ వరకు నూతనంగా జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 470 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు వచ్చే శాసనసభ ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గం నుండి BRS పార్టీ అభ్యర్థిగా నేనే పోటీలో ఉంటానన్న ఆయన… వయస్సు పెరిగినా ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో యువకునిలా పని చేస్తున్నాన్నారు.