బీర్ పూర్ మండలంలో దట్టమైన పొగ మంచు ఆవరించింది. వేకువ జామున భారీగా పొగ మంచు కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బీర్ పూర్ మండల కేంద్రంలో పలు గ్రామాలలో కనుచూపుమేరలో పొగ మంచు నెలకొంది. ముందు వెళ్తున్న వాహనాలు కనింపకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు,దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని ముందుకు సాగారు.. ఇళ్ల మధ్యలో సైతం మంచు కమ్మేసింది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు తగ్గలేదు.
ఈ సంవత్సరం చలికాలంలో పొగ మంచు కురవడం ఇదే మొదటి రోజు. శనివారం ఉదయం నుంచే గ్రామాల్లో పొగ మంచు కప్పి ఉండడంతో ఇంట్లో నుండి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నిత్యం ఉదయం వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేవారు, పాడి పశువుల నుండి పాలు పితికే వారి పరిస్థితి మాత్రం చెప్పనక్కరలేదు. పక్కిల్లు కూడా కూడా కనిపించని పరిస్థితి పొగమంచు గ్రామాలను కమ్మేసింది.
అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు వెళ్లకపోవడం మంచిదని ఇంత పెద్ద మొత్తంలో కురుస్తున్న పొగ మంచు వల్ల బయటకి వెళితే మనుషులు అనారోగ్యాన్ని గురయ్యే అవకాశాలు లేకపోలేదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రొద్దున పొగ మంచుతో మధ్యాహ్నం సమయంలో ఎండ వేడికి ఉక్కపోతకు గురవుతున్నప్రజలు ఒకవైపు వర్ష వాతావరణం సూచనలు ఒకవైపు పంట పొలాలు కోతలు, పత్తులు తీసే సమయము కాబట్టి ఇలాంటి పరిస్థితులలో వాతావరణంలో ఇలాంటి మార్పుల వలన రైతులు అయోమయంలో ఉన్నారు.