మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna)కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా ఆమె నియమితులయ్యారు. ఈమేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha).. కేసీఆర్‌కు రాసిన లేఖపై డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటి? అని ప్రశ్నించారు. ఎప్పుడంటే అప్పుడే తండ్రిని కలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కవితను కేసీఆర్ కలవట్లేదా? అసలు లేఖ రాయడానికి గల ఉద్దేశం ఏంటి? అంటూ నిలదీశారు. ఈ లేఖపై విపరీతమైన ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కవిత నుంచి కానీ ఎందుకు స్పందన లేదన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర అని ఆరోపించారు.