సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో బీజేపీ ఎంపీ డీకే అరుణ(DK Aruna) హాట్ కామెంట్స్ చేశారు. హీరో అల్లు అర్జున్ ఇంట్లో పిల్లలని భయబ్రాంతులకు గురిచేసేలా ఇంటి పై దాడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బౌన్సర్ లను పెట్టుకుని తిరిగిన ఏకైక రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అంటూ ఫైర్ అయ్యారు.
- Advertisement -
ఆయన సీఎం కాకముందు బౌన్సర్‌లను పెట్టుకుని తిరగలేదా అంటూ ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసమే అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ చర్యల వల్ల హైదరాబాద్‌లో ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని.. ఇక సినీ ఇండస్ట్రీని కూడా హైదరాబాద్ నుంచి పంపించే కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.