తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటుందని సూర్యాపేట బిజెపి మండల అధ్యక్షుడు పార్తనబోయిన విజయ్ కుమార్ అన్నారు. భారతీయ జనతా పార్టీ సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూసిన నిరుద్యోగులకు అన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చి వాటి పరీక్షలు కూడా ఒకేసారి ఒకేరోజు నిర్వహించడం నిరుద్యోగులలో ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఒక నిబద్దతలేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు, విద్యుత్ శాఖలో లైన్మెన్, ఏ.ఈ, కమ్యూనికేషన్ మరియు కానిస్టేబుల్ పరీక్షలు రెండు ఈ నెల 30న నిర్వహించడం పట్ల ప్రభుత్వానికి సరైన సమన్వయం లేదని అర్థమవుతుందని అన్నారు. ఈ నోటిఫికేషన్లలో నిరుద్యోగులు అందరూ దాదాపు అన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే పరీక్ష తేదీల్లో మార్పు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శలు పగిడి శ్రీనివాస్, దిద్ధకుంట్ల విజయ్ రెడ్డి, కోశాధికారి గొడ్డేటి పవన్, దళిత మోర్చా అధ్యక్షులు ఉప్పెల్లి ప్రవీణ్, ఓబిసి మోర్చా అద్యక్షులు చింతలచెర్వు సతీష్, కిసాన్ మోర్చా అధ్యక్షులు పర్షనబోయిన సత్యం, దారముల్ల గురువయ్య, తదితరులు పాల్గొన్నారు.