Sunday, July 7, 2024
HomeతెలంగాణTelangana: అధికారమే లక్ష్యంగా బీజేపీ మిషన్-90.. ఎంతవరకు కలిసి వస్తుందో?

Telangana: అధికారమే లక్ష్యంగా బీజేపీ మిషన్-90.. ఎంతవరకు కలిసి వస్తుందో?

- Advertisement -

Telangana: అఫీషియల్ గా తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడన్నది ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ.. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఎన్నికలపై చర్చలు, టార్గెట్స్, షెడ్యూల్స్ సిద్ధం చేసుకొని ఎన్నికల వేడిని రగిలించేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ ఒకపక్క బహిరంగ సభలను నిర్వహిస్తూనే ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళతో మమేకమయ్యే ప్లాన్ వేస్తున్నారు.

రాష్ట్రంలో గెలుపు తమదేనని ధీమాతో ఉన్న బీఆర్ఎస్ అందుకు తగ్గ పక్కా ప్రణాళికలతో సంక్రాంతి తర్వాత ప్రత్యేక్ష ఎన్నికల ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుండగా.. బీజేపీ కూడా వచ్చే ఎన్నికలలో 90 స్థానాలలో గెలుపు లక్ష్యంగా రాజకీయం మొదలు పెడుతుంది. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర కోర్ కమిటీ, రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్ లు వేర్వేరుగా జరిగగా.. ఈ సమావేశాలకు బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అధ్యక్షత వహించగా.. పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించిన తరుణ్ చుగ్.. ఇందుకు రానున్న 6 నెలలే కీలకమని, పార్టీ బలం మరింత పెంచేందుకు కష్టపడాలని సూచించారు. ‘‘మన టార్గెట్.. మిషన్ 90. పార్టీ కోసం మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఆ ఫలాలు మీకే దక్కుతాయి. ఇప్పుడు ఇక్కడున్నోళ్లు రాబోయే రోజుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అవుతారనే విషయం మరిచిపోవద్దు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు క్యాడర్ ను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి” అని చెప్పారు.

‘‘మనం ఇంకా కనీసం క్యాండిడేట్లను కూడా ఎంపిక చేయలేదు. నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిపై క్లారిటీ లేకపోయినా 70 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వేల్లో తేలింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ ఎంత బలంగా ఉందో తెలిసిపోతోంది. ఇక అభ్యర్థులను ప్రకటిస్తే, రాబోయే ఎన్నికల్లో 90 సీట్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ముందస్తు ఎన్నికల గంట ఏ క్షణమైనా మోగవచ్చు. మీరంతా పూర్తి స్థాయిలో పార్టీ కోసం సమయం కేటాయించాలి. పార్టీ గెలుపు కోసం కష్టపడాలి” అని సూచించారు.

ఈ సమావేశంలో మునుగోడు ఎన్నికలపై చర్చించిన బీజేపీ నేతలు అక్కడ గెలుపు వరకు వచ్చి ఓడిపోయామని.. ఇది మనకి ఓ గుణపాఠంగా చేసుకొని వచ్చే ఎన్నికలలో 90 సీట్లను దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికలను చూసినా బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ లో మంచి మార్కులే పడతాయి. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ తోనే ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదిగింది. ఈసారి అదే పోల్ మేనేజ్మెంట్ ను పగడ్బంధీగా తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో.. బీజేపీ టార్గెట్ పెట్టుకున్న 90 సీట్లు గెలుస్తుందా అన్నది చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News