నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట ప్రజలు బిజెపి పార్టీకి పట్టం కడితే బిసి సామజిక వర్గంకు చెందిన నేతనే రాష్ట ముఖ్యమంత్రి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపిస్తే బిసి సామాజిక వర్గం వ్యక్తిని సిఎం చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించడం యావత్తు బిసి సమాజానికి గర్వకరణం అన్నారు. రాష్ట్ర జనాభాలో అర్ధ భాగం ఉన్న బీసీలను ప్రధాని మోదీ తనలో సగభాగంగా గుర్తించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటీంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయితే గొల్ల కురుమ కుమ్మరి కమ్మరి కంసాలి సాకలి మంగలి వడ్డెర విశ్వబ్రాహ్మణ బెస్తా గౌడ ముదిరాజ్ యాదవులు…. బిసి సామజిక వర్గాలకు సమ న్యాయం జరుగుతుందన్నారు. పాల ఉత్పత్తితో పాటు బండి చక్రం సృష్టించి రవాణాలో ప్రగతికి బాటలు వేసి వడ్డెరలు శిలను శిల్పంగా మలిచి దైవభక్తిని చాటడంలో మేటిగా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది బీసీ సామాజిక వర్గ ఉపకులాలు అన్నారు. 60 ఏండ్ల పాలనలో బిసిల గురుంచి అలోచించే పార్టీ ఉందంటే అది కేవలం బిజెపినే అన్నారు. బిసికు తగిన స్థానం కల్పించక 60 ఏండ్లగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి బీసీనే అని ప్రకటించిన బిజెపికి బీసీలు రుణపడి ఉండాలన్నారు.
బిజెపితోనే ఎస్సీ వర్గీకరణ
ముందు నుంచి బిజెపి పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారన్నారు. ఎప్పటికైనా ఎస్సీ వర్గీకరణ బిజెపితోనే సాధ్యమన్నారు. ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్న బిజెపి పార్టీకి మాదిగ ఉపకులాలు తమ మద్దతు ప్రకటించాలన్నారు. బహుజన సంక్షేమం కోసం బిజెపి పార్టీ కట్టుబడి ఉందని వెల్లడించారు.
చేవెళ్ల గడ్డపై బీజేపీ గెలుపు ఖాయం
చేవెళ్ల గడ్డ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సీనియర్ నాయకుడు కె. ఎస్ రత్నం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గం ప్రజలు ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించి కె ఎస్ రత్నం విజయం కోసం పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థి కె ఎస్ రత్నం విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.