Sunday, October 6, 2024
HomeతెలంగాణBollaram: వర్రకుంట కబ్జాలపై నిఘా

Bollaram: వర్రకుంట కబ్జాలపై నిఘా

గత కొన్ని రోజులుగా వర్రకుంట ఆక్రమణకు గురవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నంబర్ 83లో స్థల పరిశీలన చేశారు. సంగారెడ్డి ఆర్డీవో నాగేష్, ఇరిగేషన్ శాఖలోని పలువురు ఉన్నత అధికారులు సంయుక్తంగా కలిసి గ్రేటర్ ఇన్ఫ్రా సంస్థ నిర్మాణాలు చేపడుతున్న స్థలాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు . అనంతరం ఆర్డీవో నాగేష్ మాట్లడుతూ పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలించి వివిధ శాఖల నుంచి ఆధారాలు శేకరించి పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కి అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గతంలో రెవెన్యూ శాఖ వద్ద ఉన్న రికార్డులను,సంస్థ ప్రతినిధుల వద్ద ఉన్న రికార్డులన్నింటినీ తీసుకొని రెవెన్యూ కార్యాలయానికి రావాలని సూచించారు. గత 25 సంవత్సరాలుగా స్థలం పై హక్కులు అన్ని తమకే ఉన్నాయని, అంతేకాకుండా సుమారు ఏడు ఎకరాల స్థలంలో ఎలాంటి ప్రభుత్వ భూముల ఆక్రమణ జరగలేదని గ్రేటర్ ఇన్ఫ్రా సంస్థ అధికారుల ముందు చెప్పుకో వచ్చింది.
కాగా గత కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతంలో చెరువు ఉండేదని దాన్ని అన్యక్రాంతం చేశారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిజాన్ని తేల్చి ఆక్రమణ ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తాము ఎలాంటి అతిక్రమములకు పాల్పడలేదని సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా సంస్థ అధికారుల ముందు చెప్పుకొచ్చింది. 1995కు ముందు ఈ వర్రకుంట గురించి ఎలాంటి సమాచారం ఉన్న తమకు అందించాలని ఇరిగేషన్ అధికారులు స్థానికులను కోరారు. వర్రకుంట స్థల పరిశీలనకు వచ్చినవారిలో జిన్నారం తాసిల్దార్ దశరథ్ సింగ్, ఇరిగేషన్ ఈఈ మధుసూదన, డిఈ రామస్వామి, ఎఈ దిలీప్ కుమార్, సంగారెడ్డి డివిజన్ సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ బాల రా జ్, అర్ఐ జయప్రకాష్ నారాయణ, సర్వేయర్ రామభద్రం తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News