Friday, September 20, 2024
HomeతెలంగాణBollaram: హార్టెక్స్ కార్మికులకు అండగా ఉంటాం

Bollaram: హార్టెక్స్ కార్మికులకు అండగా ఉంటాం

కార్మికుల పట్ల మొండి వైఖరిని అనుసరిస్తూ, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా లాకౌట్ ను ప్రకటించిన హార్టెక్స్ రబ్బర్స్ లిమిటెడ్ యాజమాన్యం కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు.

- Advertisement -

ఐడిఏ బొల్లారం పారిశ్రామిక వాడలో గల హార్టెక్స్ రబ్బర్స్ వర్షం యాజమాన్యం ఇటీవల అప్రకటిత లాకౌట్ విధించింది. దీనిని నిరసిస్తూ పరిశ్రమ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కంపెనీ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులకు మద్దతుగా సోమవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ నిరసన శిబిరాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ప్రాథమిక హక్కుల సైతం యాజమాన్యం అణచివేయడం దారుణం అన్నారు. యాజమాన్య కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రశ్నించినందుకు 12 మంది కార్మికులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా.. లాకౌట్ ను ప్రకటించి కార్మికుల కుటుంబాలను మానసికంగా వేధించడం సమంజసం కాదన్నారు. యాజమాన్యం తక్షణమే మొండి వైఖరిని విడనాడి, కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే .. సంబంధిత కార్మిక శాఖ మంత్రితో చర్చించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సీనియర్ నాయకులు, పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News