వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు(Bomb Threat) వచ్చాయి. గుర్తు తెలియని దుండగులు కోర్టులో బాంబు పెట్టినట్లు పోలీసులకు మెయిల్ ద్వారా దేశం పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణాన్ని బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీ చేస్తున్నాయి. కోర్టు సిబ్బందితో పాటు ప్రజలను బయటకు పంపించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల ప్రభుత్వ ఆస్తుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కామన్ అయిపోయింది.