Home తెలంగాణ BRS: మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం

BRS: మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం

BRS:  మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నాం

రేపటి మోదీ పర్యటనను బీఆర్‌ఎస్‌ పార్టీ బహిష్కరిస్తోందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ పుట్టుకనే వ్యతిరేకించిన మోదీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు. గుజరాత్‌కు రూ.20వేల కోట్లతో కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చి, తెలంగాణకు కేవలం రూ. 521 కోట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారుస్తున్న మోదీ విభజన హామీలు అమలు చేయలేదన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ కలిసే పనిచేస్తున్నాయని చెప్పారు. ఎవరు మోదీని కొట్టగలరో, వేటకుక్కలను ఎదుర్కోగలరో ప్రజలకు స్పష్టత ఉందని, రాబోయే ఎన్నికల్లోనూ వారి వీపు పగులగొడతారన్నారు. గతంలో పీడించుకుతిన్న రాబంధులను తిప్పికొడతారని, తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకూ బీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు,పన్నినా,ఏ దుష్ప్రచారాలు చేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్సేనన్నారు.గాంధీభవన్‌లో గాడ్సే దూరాడని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ఏ హోదాతో తమను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.ఆయనను అసలు లీడర్‌గా ఎవరు గుర్తిస్తున్నారన్నారు? ఆయన పుట్టుక, బీజేపీ పుట్టుపూర్వోత్తరాలు ప్రజలకు తెలుసునన్నారు. చంద్రబాబు గతంలో మోదీని బూతులు తిట్టి.. తిరిగి ఆయనతో కలుస్తానంటే వినడానికే సిగ్గుగా ఉందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ను ఎవరూ ఆపలేరన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మోదీ ఏంచేశారో చెప్పాలన్నారు.