కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో గురుకులం కి చెందిన గిరిజన విద్యార్థిని శైలజ విషాద మరణం చెందడం తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మరణించిందని బీఆర్ఎస్ (BRS) అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల మొదటి వారంలో వాంకిడిలోని గురుకులంలో పలువురు విద్యార్థినులతో పాటు ఫుడ్ పాయిజన్ కావడంతో శైలజ ఆస్పత్రి పాలైంది. బాలిక పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న శైలజ సోమవారం కన్ను మూసింది. బాలిక మృతి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది… తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థిని కుటుంబానికి బాధ్యత వహించి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.