- భూదాన్ పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్, కో ఆప్షన్ సభ్యులు , వార్డ్ మెంబర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సుమారు 100 మంది, కప్రాయిపల్లి గ్రామం నుండి యాదవ సంఘం సభ్యులు గ్రామ మాజీ సర్పంచ్, మరియు ముఖ్య నాయకులు 100 మంది కాంగ్రెస్ పార్టీని వీడి సీఎం కెసిఆర్ పథకాలకు మరియు తెలంగాణ రాష్ట్రములో జరిగే అభివృద్ధి, భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాలనలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో రెండు గ్రామాల నుండి 200 మందికి పైగా భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే వారిని ప్రోత్సహిస్తూ పార్టీ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లా వేళల తనసహకారం ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పార్టీ సుధాకర్ రెడ్డి కార్యదర్శి సిలువేరు బాల్ నరసింహ వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
BRS joinings: పైళ్ళ సమక్షంలో బిఆర్ఎస్ లోకి చేరికలు
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన 200 మంది