మహబూబాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు పార్టీ అధినేత, సీఎం కేసిఆర్. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవితా నాయక్ ని సీట్లో కూర్చుండ బెట్టి, స్వయంగా కేసీఆర్ ఆశీస్సులు అందచేశారు.
- Advertisement -
అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనూ సీఎం కేసీఆర్ కార్యక్రమాలు బిజీగా సాగాయి. పార్టీ కార్యాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావును సీట్లో కూర్చోబెట్టి కేసీఆర్ ఆశీర్వదించారు.