Monday, November 17, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అల్లుడిపై ఈడీకి ఫిర్యాదు

CM Revanth Reddy| తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన అల్లుడు గొలుగూరి సత్య నారాయణ, మాక్స్ బెయాన్ ఫార్మా కంపెనీపై ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు చేశారు. క్రిశాంక్ ఇచ్చిన ఫిర్యాదును ఈడీ అధికారులు స్వీకరించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.

- Advertisement -

కాగా కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఫార్మా కంపెనీకి ప్రభుత్వం ముంకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీకి భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్, అధికారులు రైతులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో కొందరు లగచర్ల రైతులు కలెక్టర్‌పై రాళ్ల దాడి చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడి వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని పోలీసులు తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కంపెనీకి చౌకగా భూములు కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌ రావు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అల్లుడుపై ఈడీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad