బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళనకి దిగారు. వారితో పాటు పార్టీ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, గురువారం మహబూబాబాద్ లో బీఆర్ఎస్ మహాధర్నా (BRS Mahadharna) కు పిలుపునిచ్చింది. ఫార్మా సిటీ పేరుతో గిరిజన, దళిత, పేద రైతుల భూములను గుంజుకుంటూ.. అర్ధరాత్రి కరెంట్ తీసేసి, కొడుతూ… వారిని అరెస్ట్ చేసిన రేవంత్ సర్కార్ అక్రమాలకు నిరసనగా రేపు (నవంబర్ 21న) ఉదయం పది గంటలకు మహాధర్నా చేయనున్నట్లు ప్రకటించింది.
అయితే, బీఆర్ఎస్ మహాధర్నా (BRS Mahadharna)కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పార్టీ ముఖ్యనేతలంతా అనుమతి ఇవ్వాలని మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయంలో దాదాపు రెండు గంటలసేపు వెయిట్ చేశారు. అయినప్పటికీ పర్మిషన్ రాకపోవడంతో రాత్రి 10 గంటల నుంచి వారంతా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళనకి దిగారు. రేపటి మానుకోట రైతు గిరిజన మహా ధర్నాకు అనుమతి ఇచ్చేవరకు ఇక్కడే నిద్రిస్తాం ఇక్కడే ఉంటాం, కదిలేదే లేదు అని నిరసన చేపట్టారు. కాగా, ఈ మహాధర్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.