Monday, November 17, 2025
HomeతెలంగాణBRS: ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే దివాకర్

BRS: ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే దివాకర్

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదోవా వార్డ్ గ్రీన్ సిటీలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్థానిక ప్రజలకు వివరించారు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని హామీచ్చారు. సంక్షేమాభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎవరు సలహాలు ఇచ్చినా సానుకూలంగా స్పందించి వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పెంట రాజయ్య, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad