Kaushik Reddy| బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. ఎస్‌ఐని అడ్డుకుని హల్‌చల్ చేశారు. విధులకు ఆటంకం కలిగించరంటూ ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఇవాళ ఉదయం ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
అయితే అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్‌రావు(Harish Rao), జగదీశ్‌రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీశ్‌రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.