ఎమ్మెల్సీ కవిత హౌస్ అరెస్ట్, కవిత ఇంటి ముందు మోహరించిన పోలీసులు. కాగా 125 అడుగుల బీ ఆర్ అంబెడ్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు ఉదయం 11 గంటలకు బీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధకాండపై నిరసన తెలపాలని నిన్న నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉదయం పది గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ్నుంచి పదకొండు గంటలకు నెక్లస్ రోడ్డు లోని అంబెడ్కర్ విగ్రహం దగ్గరకు చేరుకోవాలని ముందుగా నిర్ణయించగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే తమను ఇలా అరెస్టులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హౌస్ అరెస్ట్ చేశారు. కొంపల్లి, దండెమూడి ఎంక్లేవ్ లోని వివేకానంద్ ఇంటి ముందు పోలీసులు మొహరించారు. ట్యాంక్ బండ్ మీద ధర్నా కు బి అర్ ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి.