తమ ప్రభుత్వం యువతకు అన్యాయం చేసే ప్రభుత్వం కాదంటూ మంత్రి గంగుల కమలాకర్, శాసన మండలి చీఫ్ విప్ టి. భానుప్రసాద్ , ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీఆర్ ఎస్ కార్మిక విభాగం నేత రూప్ సింగ్ తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. TSPSC ఘటనను కారణంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని వారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన రాజకీయ లబ్ధికోసం విమర్శలు చేస్తున్నారని వీరంతా ఆరోపించారు. TSPSC స్కాం కాదు…ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమేనంటూ వారు అన్నారు. రోశయ్య ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగాయి..అప్పటి ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారా? అంటూ వారు నిలదీస్తుండటం విశేషం. 2010లో UPPSC లో ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే ప్రధాని రాజీనామా చేశారా?, కర్ణాటక, యూపీ, గుజరాత్ లో జరిగిన ఘటనలు జరిగాయి అక్కడి మంత్రులు, ప్రభుత్వాలు రాజీనామా చేశారా? అంటూ వారు ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.