కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. బీసీ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యాఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడు, స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు వారికి అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. వారికి ఆ ఫలితాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. శాసనసభలో మనం బిల్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటులో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని తెలుపుతున్నాను
లోక్‌సభలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.. ఆయన వెనకాల 100 మంది ఎంపీలు కూడా ఉన్నారు.. ఈ బిల్లు కోసం రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలి’ అని హరీష్ రావు సూచించారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ఎన్నికలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించారు. మొట్టమొదటిసారిగా దేశంలో గౌడ కులస్థుల కోసం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు సైతం తీసుకొచ్చారు” అని హరీష్ రావు వెల్లడించారు.