బీజేపీ నేత చికోటి ప్రవీణ్ కుమార్(Chikoti Praveen Kumar)పై పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నల్గొండలో స్థానిక బీజేపీ నేతలు నిర్వహించిన శోభాయాత్రలో ప్రవీణ్ పాల్గొన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే చికోటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా చికోటిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ నేతలు పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓవైసీ బ్రదర్స్‌ను ఉద్దేశించి ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.